అవికా గోర్ ప్రధాన పాత్రలో వధువు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నందు, అలీ రెజా కీలక పాత్రధారులు. ఈ వెబ్ సిరీస్ ను శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మిస్తున్నారు. పోలూరు కృష్ణ దర్శకుడు. వధువు వెబ్ సిరీస్ ప్రత్యేకతల గురించి నటి అవికాగోర్ మీడియాకు వివరించింది.
ఇటీ-వలే మాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో నటించాను. ఆ సమయంలోనే వధువు ప్రాజెక్ట్ గురించి చెప్పారు. బెంగాలీ వెబ్ సిరీస్ ఇందును తెలుగులోకి వధువుగా తీసుకొస్తున్నారు. ఇందులో నాకు ఒక యూనిక్ క్యారెక్టర్ దొరికింది అనిపించింది.
ఇందులో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయా అని అందరూ అడుగుతున్నారు. ఇందులో అలాంటివి ఉండవు. థ్రిల్లర్ జానర్ లో ఆసక్తిగా సాగుతుంది.
స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ అందులోని ప్రశ్నలు నాకు ఆసక్తిగా అనిపించాయి. ఇలా ఎందుకు జరిగింది అనే ఎన్నో ప్రశ్నలు ఇందులో ఉంటాయి. బెంగాలీ ఓరిజినల్ వెబ్ సిరీస్ ఇందులోని కొన్ని ఎపిసోడ్స్ చూశాను.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ చేసేప్పుడు నాకు పదేళ్ల వయసు. అప్పటికి పెళ్లంటే ఎంటే, పెళ్లి కూతురు ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై ఏమాత్రం అవగాహన లేదు. సందేహాలు వస్తే డైరెక్టర్ ను అడిగేదాన్ని. ఇప్పుడు వధువు వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు అలాంటి ఇబ్బంది లేదు. పెళ్లి, వధువు అంటే ఏంటి అనే విషయాలు తెలుసు. చిన్నప్పుడే నటిగా మారడం వల్ల త్వరగా అన్ని విషయాలు నేర్చుకోగలిగా.
ఇప్పటిదాకా నేను ఆన్ స్క్రీన్‌లో కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా చీర కట్టు-కుని, హెయిర్ ్టసల్ చేసుకుని మేకప్ కావడం నాకు ఇష్టం. చిన్నారి పెళ్లి కూతురు -టైమ్ కు వధువు చేసేప్పటికి నటిగా నాకున్న నాలెడ్జ్, అనుభవంలో చాలా మార్పు ఉంది.
దర్శకుడు పోలూరు కృష్ణ అనుభవం ఉన్న దర్శకుడు వధువు వెబ్ సిరీస్ ను ఆయన హాట్ స్టార్ లో ఉండాల్సిన క్వాలిటీ- మెయింటేన్ చేస్తూనే టీ-వీ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా రూపొందించాడు. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నా అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నా.