బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ నటించిన మూవీ బూట్‌కట్ బాలరాజు. రొమాంటిక్ ఎంటర్టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది అధికారికంగా వెల్లడించారు.
ఇక ఈ సినిమాలో సోహెల్ తోపాటు మేఘలేఖ, సునీల్, ఇంద్రజ, సిరి హనుమంతులాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. శ్రీ కోనేటి సినిమాను డైరెక్ట్ చేశారు. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించగా.. మహ్మద్ పాషా నిర్మించాడు.