తెలుగు ఇండస్ట్రీ అల్ టైమ్ గ్రేట్ కమెడియన్స్లో బ్రహ్మానందం అందరికంటే ముందుంటాడు. ఈ తరం ప్రేక్షకులకు, ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా సినిమాలు చేయలేకపోయినా.. బ్రహ్మానందం మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ మీమ్స్ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటాడు. రీసెంట్గా ‘కీడా కోలా’ అనే సినిమాలో తాత పాత్రలో మెరిసి అందరిని అలరించాడు. అయితే ఈ లెజెండరీ కమెడియన్ ఆత్మకథ మీద ఒక పుస్తకం వచ్చింది.
ఈ ఆత్మకథను స్వయంగా బ్రహ్మానందంమే రాయగా.. ఈ పుస్తకానికి ‘నేను .. మీ బ్రహ్మానందం’ అనే టైటిల్ పెట్టాడు. బ్రహ్మానందం జీవితంలోని అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలను ఆయన ఈ పుస్తకంలో రాసుకొచ్చారని సమాచారం. ఇక, ఈ పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి స్వయంగా బ్రహ్మానందంమే చిరుకు అందజేశాడు. ఈ సందర్భంగా ఆ అనందపు క్షణాలను పంచుకుంటూ చిరంజీవి ఒక స్పెషల్ పోస్ట్ పెట్టాడు.