ఫ్యామిలీ అండ్ లవ్ డ్రామాగా వచ్చిన బొమ్మరిల్లు సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్స్ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ సినిమా. 2006 ఆగస్ట్ 9న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికీ 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది.
కాగా, ఈ బొమ్మరిల్లు మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు దిల్ రాజ్ నిర్మాణ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్ 21న బొమ్మరిల్లును రిరిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తమ ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ వింటేజ్ లవ్ స్టోరీని మరోసారి థియేటర్లో చూసేందుకు సినీ అభిమానులు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.