వివాదాస్పద నటి కంగనా రనౌత్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న కంగనా రనౌత్ ఇప్పుడు ఓ టి టి లో అడుగుపెట్టబోతున్నారు. మంచి సక్సెస్ అయిన ఇంగ్లీష్ టెంప్టేషన్ ఐలాండ్ కి ఇండియన్ వెర్షన్ ని కంగనా రనౌత్ చేయబోతున్నారట. అయితే ఇది ఒక డేటింగ్ షో. కాగా దీన్ని ఇండియాలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న ఓటీటీ సంస్థ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా కంగనారనౌత్ కి పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా చెల్లించే అవకాశం ఉందట. ఈ షోకు సరైన ఆప్షన్ కంగనారనౌత్ అని సదరు ఓటిటి సంస్థ భావిస్తోందట. అందుకే ఆమెనే సెలెక్ట్ చేసుకుందట.