సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ జరీన్ ఖాన్ తాను కాస్టింగ్ కాచ్ బాధితురాలిని అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కెరీర్ మొదట్లో నేను చాలా ఇబ్బందులు ఎదుర్కోన్నాను. ఇబ్బంది పెట్టిన వారి పేర్లను బయట పెట్టాలని అనుకోవడం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాకు పరిచయం అయిన వ్యక్తి ముందు చాలా అమాయాకంగా నటించాడు. అతని సినిమాలో నటించే అవకాశం కూడా ఇప్పిస్తానని అన్నాడు. తన సినిమాలో ముద్దు సీన్ ఉంటుందని, దాని కోసం ముందుగా రిహార్సల్స్ చేద్దామని చెప్పి అసభ్యంగా ప్రవర్తించే వాడు. మనసులో భయాలని పక్కన పెట్టు అంటూ దర్శకుడు నాతో దారుణంగా ప్రవర్తించాడు. స్నేహితుల కన్నా ఎక్కువగా ఉందామని, సినిమా ఆఫర్స్ వచ్చేలా నేను చేస్తానని అన్నాడు అంటూ అప్పటి విషయాలని తాజాగా మరోసారి చెప్పుకొచ్చింది జరీనా. వీర్ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేసిన జరీనా ‘హౌజ్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2’తో పాటు మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలోను నటించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement