పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విఫలం కావడం పట్ల తాజాగా డైరెక్టర్ బాబీ స్పందించారు. పవన్ అభిమానిగా నేను ఆ సినిమా చేశాను.
కానీ ఫ్యాన్స్ ను సంతృప్తి పరచలేకపోయాను. కానీ నాకు రెండో సినిమానే పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అది నాకు ఎప్పటికీ గౌరవమే. స్క్రిప్ట్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే బావుండేది. ఎంత పెద్ద స్టార్ అయినా స్క్రిప్ట్ సరిగ్గా లేకపోతే ఫెయిల్ అవుతారనేది తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు బాబీ.