Tuesday, November 19, 2024

Blessings – సురేష్ గోపి కుమార్తె వివాహం … నూత‌న జంట‌కు మోడీ ఆశీర్వాదం …

కేరళ: జనవరి 17 ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. సురేశ్ గోపీ పెద్ద కుమార్తె భాగ్య సురేశ్ వివాహం గురువాయుర్ ఆలయంలో బుధవారం జరిగింది. కేరళ పర్యటనలో ఉన్న మోడీ కోచ్చిలో రోడ్డు షో నిర్వహించిన అనంతరం నేరుగా ఆలయానికి వచ్చి, వధూవరులను ఆశీర్వదించారు. కొత్త దంప‌తుల‌కు స్వయంగా మోడీ వరమాలలు అందించారు. అదే ఆలయంలో వివాహం జరుపుకుంటున్న మరో 30 జంటలకు కూడా మోదీ ఆశీర్వచనాలు అంద జేశారు. ప్రముఖ నటుడు మోహన్ లాల్ తోపాటు మలయాళ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు కూడా సురేశ్ గోపీ కుమార్తె వివాహానికి హాజరై నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించారు..

కాగా, మోడీ గురువాయిర్ లో స్వామివారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యానికి చేరుకున్న ప్ర‌ధానికి ఆల‌య మర్యాద‌ల‌తో స్వాగ‌తం ప‌లికారు వేద పండితులు..దర్శ‌నానంత‌రం తీర్ద‌ప్ర‌సాదాలు, జ్ఞాపిక‌ను అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement