Wednesday, November 20, 2024

బిపాసా కూతురుకి నామకరణం.. ఏం పేరు పెట్టిందో తెలుసా!

బాలీవుడ్ జంట బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ పేరెంట్స్​ అయ్యారు. నిన్న (శనివారం) వారికి బిడ్డ పుట్టినట్టు తెలిపారు. తమకు పాప పుట్టిందని సోషల్ మీడియాలో ఈ క్రేజీ కపుల్​ సంబురంగా ప్రకటించారు. ఆగస్ట్ 16వ తేదీన బిపాసా, కరణ్ తాము పేరెంట్స్​ కాబోతున్న విషయాన్ని వెల్లడిచేశారు. ఇక.. సోషల్ మీడియాలో బిపాసా అయితే.. తన ప్రెగ్నెన్సీని తెలియజేస్తూ ఎంతో సంతోషంగా పోస్టులు పెడుతూ వచ్చింది.

కాగా, ఇవ్వాల (ఆదివారం) బిపాసా, కరణ్​ దంపతులు తమ పాపకు ‘దేవీబసు సింగ్ గ్రోవర్’ గా నామకరణం చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఒక ఫోటోని పోస్టు చేయడం ద్వారా వెల్లడించారు. పాప ఫొటోని చూసిన బిపాసా అభిమానులు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ వారిని​ అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఈమధ్య సెలబ్రిటీ జంటలు రణబీర్ కపూర్- అలియా భట్, గుర్మీత్ చౌదరి – డెబినా బోనర్జీ కూడా తల్లిదండ్రులైన విషయం తెలిసిందే.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement