Thursday, September 5, 2024

Bigg Boss | బిగ్ బాస్ 8లో వ‌ర్షిణి ఎంట్రీ…

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 8కి సంబంధించిన కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఫైనల్‌ అయ్యారు. ఇక ప్రతిసారి బుల్లి తెర యాంకర్‌ కి ఛాన్స్ ఇస్తూ వస్తున్న బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఈసారి ఆ స్థానంను అందాల యాంకర్‌ వర్షిణి భర్తీ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా యూట్యూబర్‌ గా మంచి పేరు తెచ్చుకుని, ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన నిఖిల్ ను కూడా ఈసారి బిగ్‌ బాస్ వారు సంప్రదించారట. ఇక బర్రెలక్క, అమృత ప్రణయ్‌ తో పాటు కుమారీ ఆంటీకి కూడా ఛాన్స్ దక్కిందనే వార్తలు వస్తున్నాయి.

నాగార్జున ఇప్పటికే కొత్త సీజన్ కి సంబంధించిన అగ్రిమెంట్‌ పై సైన్ చేయడం జరిగింది. మరో వైపు కొత్త సీజన్ కి సెట్‌ నిర్మాణం కూడా జరుగుతుందని మా టీవీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్‌ లో బిగ్‌ బాస్ సీజన్‌ 8ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement