Wednesday, October 16, 2024

Bigg Boss S8 | ‘బిగ్ బాస్ 8’ లోగో, ప్రోమో రిలీజ్…

బిగ్ బాస్ షోకి జనాల్లో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోపై ఓ వైపు విమర్శలు వెల్లువెత్తుతున్నా మరోవైపు ప్రేక్షకులు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలోనే పెద్ద హిట్ అయిన ఈ షో తెలుగులోనూ విపరీతమైన ఆదరణ పొందింది.

ఇక ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన 7 సీజన్లు సూపర్ హిట్ కావడంతో, సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక‌ సీజన్ 8 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది…, తాజాగా, బిగ్ బాస్ సీజన్ 8 గురించి ఒక అప్‌డేట్ ఇచ్చారు. హీరో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించిన కొత్త లోగోను రివీల్ చేస్తూ ఒరిజినల్ ప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ షో ఎప్పుడు మొదలవుతుందనేది మాత్రం చెప్పలేదు.

కాగా, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించగా, ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక‌ బిగ్ బాస్ షో మూడో సీజన్ నుంచి హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఉన్న బిగ్ బాస్ షో రూల్స్, హోస్టింగ్ ప్రాసెస్ మొత్తాన్ని సీజన్ 7 నుంచి మార్చేశారు. ముఖ్యంగా సీజన్ 7లో నాగార్జున హోస్టింగ్ అదరగొట్టేశాడంటూ ఆడియన్స్ మెచ్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement