బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే నాలుగు సీజన్ లను పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5 వ సీజన్ కు సిద్ధం అవుతుంది. కరోనా కారణంగా కాస్త ఆలస్యమైన ఈ షో త్వరలోనే స్టార్ట్ కాబోతోంది. కాగా తాజాగా బోర్ డమ్ కి చెప్పండి గుడ్ బై అంటూ షో కి సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. నిజానికి ఈసారి హోస్ట్ గా వ్యవహరించేది రానా అంటూ గత కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
కానీ వాటన్నింటికీ బ్రేక్ వేస్తూ నాగార్జున కనిపించారు. ఇక ఈ సీజన్ లో 16 మంది సెలబ్రిటీలను జూమ్ మీటింగ్ ద్వారా ఎంపిక చేశారు. సెప్టెంబరు 5న ప్రారంభం కాబోయే ఈ షో కోసం ఇప్పటికే హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్ లు అందరూ కూడా క్వారంటైన్ కి సిద్దమవుతున్నారు.