బుల్లితెర మెగా రియాలిటీ షో బిగ్ బాస్ 5 సీజన్ కోసం నిర్వహకులు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఐదవ సీజన్ కోసం సన్నద్దమవుతోంది. దీనికోసం కంటెస్టెంట్స్ ని కూడా ఫీక్స్ చేసినట్లు తెలుస్తోంది. . నిజానికి బిగ్ బాస్ ఐదో సీజన్ ను జూన్ నెలలోనే నిర్వహించాలని బిగ్ బాస్ షో నిర్వాహకులు భావించినప్పటికీ కరోనా పరిస్థితుల కారణంగా వీలు కాలేదు. అయితే త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 రాబోతుంది. దీనితో ఈ షో ను ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కచ్చితంగా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కూడా బిగ్ బాస్ హౌస్, కొత్త కొత్త టాస్క్ లతో బిగ్ బాస్5 ఈసారి మరింత రసవత్తరంగా ఉండబోతుందని అన్నట్టు సమాచారం. అయితే ఈ షో లో హోస్ట్ ఎవరనే విషయం పై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.కానీ కంటెస్టెంట్ లు మాత్రం ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే ఈ సారి బిగ్ బాస్ సీజన్ 5 లోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్ లు వీరే.
- యాంకర్ రవి
- క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా
- గెటప్ శ్రీను
- యాంకర్ వర్షిణి
- రఘు మాస్టర్
- సురేఖ వాణి
- సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి
- షణ్ముఖ్ జస్వంత్
- ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా
- యూట్యూబర్ సిరి
- లోబో
- సింగర్ మంగ్లీ
- టిక్ టాక్ స్టార్ దుర్గా రావు
- 14.టీవీ 9 ప్రత్యూష
- సీరియల్ ఆర్టిస్ట్ లు సిద్ధార్థ్ వర్మ అండ్ భార్య విష్ణు ప్రియ.
ఇది కూడా చదవండి: ఆ అలవాటుకి బానిసనయ్యాను: అనుపమ..