తమిళ హీరో విజయ్ ఆంటోని నటించిన చిత్రం బిచ్చగాడుద.. తెలుగులో రూ. 14కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం అందరి కళ్లు బిచ్చగాడు-2 పైనే ఉన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 19న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొల్పాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. లక్ష కోట్లకు వారసుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. తొలిపార్టులో లానే సీక్వెల్లో కూడా దీక్ష పుచ్చుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సీక్వెల్ బ్రేయిన్ ట్రాన్స్‌ప్లెంటేషన్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఇక ట్రైలర్‌ను గమనిస్తే సీక్వెల్ చాలా గ్రాండియర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలన్నీ ట్రైలర్‌తో రెట్టింపు అయ్యాయి.మరి ఈ చిత్రం ఏ మేరకు విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
Advertisement
తాజా వార్తలు
Advertisement