Saturday, November 23, 2024

మంచి కంటెంట్‌ చూపించాలానే ‘భోళా శంకర్‌’ చేశాం – మెగాస్టార్‌ చిరంజీవి

మెగాస్టార్‌ చిరంజీవి తమన్నా భాటియా, కీర్తి సురేష్‌, సుశాంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు ‘భోళా శంకర్‌ ‘ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటుగా అల్లు అరవింద్‌, నిర్మాత టీ-జీ విశ్వప్రసాద్‌, ఏఎం రత్నం, దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, వంశీ పైడిపల్లి, సంపత్‌ నంది, బుచ్చిబాబు సాన తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ ”అమ్మ ప్రేమ ఏనాటికి పాతదవదు బోర్‌ కొట్టదు. అలాగే అభిమానులు చూపించిన ప్రేమ కేరింతలు ఎప్పుడు విన్నా ఫ్రెష్‌ గా వుంటు-ంది. ఎప్పుడు చెవినపడినా హృదయాన్ని కదిలిస్తుంది. భగవంతుడు నాకు ఇలాంటి జన్మ ఇచ్చినందుకు సర్వాద కృతజ్ఞుడినై వుంటాను. అభిమానులు గర్వపడేలా వుండాలని అభిమానుల కోసం నా వ్యక్తిత్వాన్ని నడవడికని మార్చుకుంటూ వచ్చాను, ఇంతమందికి స్ఫూర్తిదాయకంగా వున్న నేను ఆచితూచి అడుగులు వేయాలని ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ మా అన్నయ్య అని మీరంతా గర్వంగా చెప్పుకునేలా ఈ స్థాయికి వచ్చాను. భోళా శంకర్‌ నాకు నచ్చింది కాబట్టే చేశాను. నాకు అంతగా నచ్చిన సినిమా మీ అందరి చేత మార్కులు వేయించుకుంటు-దనే ధైర్యంతోనే ఆగస్ట్‌11న సినిమాని మీ ముందుకు రాబోతుంది. మంచి కం-టె-ంట్‌ వున్నపుడు రీమేక్‌ చేయడంలో తప్పులేదు. వేదాళం మంచి సినిమా.మంచి కం-టె-ంట్‌ ప్రేక్షకులకు చూపించాలానే ఉద్దేశంతో భోళా శంకర్‌ చేశాం. ఈ సినిమా షూటింగ్‌ చాలా ఉత్సాహంగా గడిచింది. ఇంత ఉత్సాహం ఎందుకంటే.. ఈ సినిమా ఆల్రెడీ మా మనసుల్లో సూపర్‌ హిట్‌ అయిపోయిందనే ఫీలింగ్‌ వచ్చేసింది. తమన్నా ఇందులో మాస్‌ కామెడీ పాత్ర చేసింది. కీర్తి సురేష్‌ మహానటి. మా ఇంట్లో బిడ్డల అనిపిస్తుంది. మేమిద్దరం ఇందులో అన్నాచెల్లెలుగా నటించాం.” అని అన్నారు

నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ”చిరంజీవి గారు చూడనికి సక్సెస్‌ లేదు. మీరంతా చిరంజీవి గారి సినిమాలు చూస్తూ పెరిగితే నేను ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను.” అని పేర్కొన్నారు.
చిత్ర దర్శకుడు మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ ”నేను అన్నయ్య చిరంజీవి గారి అభిమానుల్లో నుంచి వచ్చినవాడినే. అన్నయ్యతో సినిమా చేయగలగడం నా అదృష్టం. దర్శకుడిగా నాకు ఇది పునర్జన్మ” అని అన్నారు.
చిత్ర నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ ”చిరంజీవి గారితో సినిమా చేయాలనేది నా కల ఈ సినిమాతో తీరింది.” అన్నారు.
ఇంకా ఈ వేడుకగలో కీర్తి సురేష్‌, సుశాంత్‌, దర్శకుడు బాబీ, దర్శకుడు గోపీచంద్‌ మలినేని, వంశీ పైడి పల్లి, దర్శకుడు సంపత్‌ నంది, నిర్మాత విశ్వప్రసాద్‌, ఎఎం రత్నం. శ్రీముఖి, హైపర్‌ ఆది తదితరులు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement