Friday, November 22, 2024

Bhola Sankar – మెగాస్టార్‌ తో సినిమా చేయడం నా డ్రీమ్‌ – డైరెక్టర్‌ మెహర్‌ రమేష్‌

:మెగాస్టార్‌ చిరంజీవి తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. దీనికి మెహర్‌ రమేష్‌ దర్శకుడు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు మెహర్‌ రమేష్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

– భోళా శంకర్‌ షూటింగ్‌ 2021 నవంబర్‌ 15న మొదలుపెట్టాం. మొదటి రోజే దాదాపు ఏడు వందల మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌ లు, భారీ సెట్‌ లో మెగా లెవల్‌ సినిమా స్టార్ట్‌ చేశాం. అన్నయ్య ని డైరెక్ట్‌ చేయడం ఒక డ్రీమ్‌. ఇప్పటికీ ఆ డ్రీంలోనే వున్నాను. నా ఒక్కడికే దక్కిన అదృష్టం ఏమిటంటే నేను అన్నయ్య కజిన్‌. చిన్నప్పటినుంచి ఆయన్ని చూస్తూ పెరిగాను.

– అన్నయ్య సెట్స్‌లో ఉంటేనే సరదాగా వుంటు-ంది. ఆయన కార్వాన్‌ లోకి కూడా వెళ్లారు. సెట్‌లోనే అందరితో సరదాగా వుంటారు. ఈ సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశారు. చాలా ఫాస్ట్‌ గా చేసేసావ్‌ అని అన్నారు. 120 వర్కింగ్‌ డేస్‌. అంతా పిక్నిక్‌ లా జరిగింది.

– సినిమా విషయంలో అన్నయ్య సలహాలు సూచనలు ఖచ్చితంగా వుంటాయి. రీమేక్‌ సినిమా అయినప్పటికీ ఆయనకి నచ్చితేనే ఆమోదముద్ర పడుతుంది. ఏదైనా కొత్తగా చేస్తే చాలా చక్కగా ప్రశంసిస్తారు. చాలా విలువైన సూచనలు ఇస్తారు.

– చిరంజీవి గారిని అన్నయ్య అని పిలవడం తప్పితే మరో పదం వుండదు. ఇందులో అన్నయ్య తత్వం వుంది. అది నాకు చాలా నచ్చింది. జనరేషన్‌ మారిపోయినా అనుబంధాలు అలానే వున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌ -టైన్‌ మెంట్‌ తో పాటు- బ్రదర్‌ సిస్టర్‌ ఎమోషన్‌ వున్న కథ ఇది.

- Advertisement -

– రిమేక్‌ తీయడం రిస్క్‌ కంటే బిగ్‌ టాస్క్‌ అనుకున్నాం. మరో భాషలో సక్సెస్‌ అయినదానిని జనాలకు నచ్చేలా తీయాలి. భోళా శంకర్‌ ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజంట్‌ చేశాం.

– జనరేషన్‌ మారింది కానీ అన్నయ్యపై వున్న ప్రేమ అభిమానం మారలేదు. ఒక యంగ్‌ వైబ్‌ కావాలని అనుకున్నాం. మహతి సాగర్‌ వర్క్‌ నాకు తెలుసు. మెగాస్టార్‌ స్థాయికి సాగర్‌ మ్యూజిక్‌ చేయగలడని నా నమ్మకం, సాగర్‌ నమ్మకాన్ని నిలబెట్టు-కున్నాడు.

– మెగాస్టార్‌కి చెల్లిగా నటించేందుకు ఒక మెగా నటి కావాలి. ఈ కథ లోని ఎమోషన్‌ కి కీర్తి సురేష్‌ చాలా కనెక్ట్‌ అయ్యింది

Advertisement

తాజా వార్తలు

Advertisement