Sunday, October 6, 2024

LIVE – హైదరాబాద్‌లో ‘భారతీయుడు 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. ప్రత్యక్ష ప్రసారం

YouTube video

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. ఈ నెల 12 న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. చిత్రబృందం ప్రమోషన్స్ ను ముమ్మరంగా చేస్తుంది. ఈ క్రమంలో నేడు హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో భారతీయుడు-2 చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నిర్మాత, లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్, యువ హీరో సిద్ధార్థ్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, బాబీ సింహా తదితరులు ఈ వేడుకకు విచ్చేశారు.

కమల్ హాసన్ లీడ్ రోల్‌లో రాబోతున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించ‌గా.. లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సిద్ధార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్, కాళిదాస్ జయరామ్ తదితరులు నటించారు. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు-2 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ ను కూడా ప్రదర్శించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement