Sunday, September 8, 2024

“Bhamakalapam 2” టీజర్ రిలీజ్ కి రెడీ!

హీరోయిన్ ప్రియమణి ప్రధాన పాత్రలో ఆహా వీడియోలో రిలీజ్ అయిన మూవీ భామాకలాపం. ఈ సినిమాకి సీక్వెల్‌గా భామాకలాపం 2 త్వరలో ఆహా లో విడుదల కానుంది. ఫస్ట్ పార్ట్ కి దర్శకత్వం వహించిన అభిమన్యు దీనిని కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఆహా కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి సంబందించిన గ్లింప్స్ ను ఆవిష్కరించింది. ఇక రేపు (జనవరి 30న ) సినిమా టీజర్‌ని విడుదల చేయనున్నట్లు OTT ప్లాట్‌ఫాం వెల్లడించింది.

భామాకలాపం 2లో సీరత్ కపూర్, బ్రహ్మాజీ, రఘు ముఖర్జీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డ్రీమ్‌ ఫార్మర్స్‌ బ్యానర్‌పై బాపినీడు బి, సుధీర్‌ ఈదర్‌లు ఆహాతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌ విహారి సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement