Saturday, November 23, 2024

25న వెండితెరపై యుగాంతం

ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు! ఆ రోజు యుగాంతం రాలేదు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురు లంకలో కొందరు కేటు-గాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయ కత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్‌ ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాలి. ఎందుకంటే… శివ శంకర వరప్రసాద్‌ పాత్రలో యువ హీరో కార్తికేయ గుమ్మకొండ ఆ రోజు నుంచి థియేటర్లలో సందడి చేయనున్నారు.

కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్‌ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌-టైన్‌మెంట్స్‌ పతాకంపై సి. యువరాజ్‌ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవికి కార్తికేయ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్‌. బెదురులంక 2012లో కార్తికేయ పాత్ర పేరు కూడా అదే. ఇప్పుడీ సినిమా -టైలర్‌ సైతం చిరు తనయుడు, రామ్‌ చరణ్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. -టైలర్‌ విడుదల చేసిన అనంతరం సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ కార్తికేయకు, చిత్ర బృందానికి రామ్‌ చరణ్‌ శుభాకాంక్షలు చెప్పారు.

రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ” బెదురులంక 2012 -టైలర్‌, ఇందులో చెప్పిన కథ చాలా బాగుంది. అజయ్‌ ఘోష్‌ గారి పాత్ర వచ్చినప్పటి నుంచి ఇంకా బాగుంది. సంగీతం కూడా చాలా కొత్తగా వినిపించింది. అని అన్నారు.

- Advertisement -

బెదురులంక 2012 -టైలర్‌ విడుదలైన కొన్ని క్షణాల్లోనే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని దర్శక నిర్మాతలు బెన్నీ, క్లాక్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల్ని ఈ సినిమా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, గోదావరి నేపథ్యంలో సినిమాలకు ఇదొక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేస్తుందని దర్శక, నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమాలో అజయ్‌ ఘోష్‌, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఆటో రామ్‌ ప్రసాద్‌, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌, సత్య ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్‌: అంజి, పృథ్వీ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్‌ గున్నల

Advertisement

తాజా వార్తలు

Advertisement