ఆప్ ఎంపీ రాఘవచద్దాతో రీసెంట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకుంది బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా.. కాగా తన జీవితాన్ని పరిణీతి మార్చేసిందని చెప్పారు రాఘవచద్దా. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఈనెల 13వ తేదీన ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. కాగా, నటితో తన బంధంపై రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు. ఒక మంచి రోజు ఆ అందమైన అమ్మాయి పరిణీతి చోప్రా తన జీవితంలోకి వచ్చిందని చెప్పారు. అప్పటి నుంచి తన జీవితమే మారిపోయిందన్నారు. తన ప్రయాణాన్ని పరిణీతి రంగులమయంగా మార్చిందని.. ఎన్నో నవ్వుల్ని, సంతోషాల్ని తెచ్చిందని చెప్పారు. తమ నిశ్చితార్థం ఎంతో సంతోషకరంగా జరిగిపోయిందని, అందులో ఎలాంటి ఆశ్చర్యం లేదన్నారు. ఆనందబాష్పాలు, చిరునవ్వులు, సంతోషాలు, డ్యాన్సులతో నిండిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుక తమ ప్రియమైన వారిని మరింత దగ్గర చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. ఈ మేరకు నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement