Friday, November 22, 2024

‘మా’కు సొంత భవనం నిర్మించడం కంటే అదే ముఖ్యం: బండ్ల గణేశ్

వచ్చే నెలలో ‘మా’ ఎన్నికల నేఫథ్యంలో నటుడు బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘మా’కు సొంత భవనం నిర్మించడం అంత అవసరం లేదన్నారు. ‘మా’ కు సొంత భవనం నిర్మించడం కంటే ఆ డబ్బుతో పేద కళాకారులకు సాయం చేయడం కరెక్టన్నారు. ‘మా’లో దాదాపు 900 మంది వరకు సభ్యులు ఉన్నారని, వారిలో 150 మంది వరకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండ్ల గణేశ్ అన్నారు. ‘మా’కు సొంత భవనం కట్టేందుకు అవసరమయ్యే రూ.20 కోట్ల ఖర్చుతో పేద ఆర్టిస్టులకు డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇవ్వొచ్చని ఆయన పేర్కొన్నారు. ‘మా’కు సొంత భవనం లేనందువల్ల చిత్ర పరిశ్రమకు వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. ఏదీ ఆగిపోదని అన్నారు. ‘మా’కు సొంత బిల్డింగ్ నిర్మాణానికి తాను వ్యతిరేకం అని బండ్ల గణేశ్ ఉద్ఘాటించారు. బండ్ల గణేశ్ ‘మా’ ఎన్నికల తరుణంలో ప్రకాశ్ రాజ్ వర్గానికి మద్దతు పలుకుతున్నారు. ‘మా’ను ఆయన మరింత ముందుకు తీసుకెళతాడన్న నమ్మకం ఉందని తెలిపారు.

ఇది కూడా చదవండి: బండి సంజయ్ రాసలీలలు బయటపెడుతాః TRS ఎమ్మెల్యే మైనంపల్లి సవాల్

Advertisement

తాజా వార్తలు

Advertisement