Sunday, October 20, 2024

Unstoppable S4 | సీఎం చంద్రబాబుతో బాల‌య్య అన్‌స్టాపబుల్… సీజన్ 4 ప్రారంభం..!

తెలుగు ఓటీటీ ఆహాలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ మంచి పాపులారిటీ సాధించింది. మూడు సీజన్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుని.. నాలుగో సీజ‌న్‌కు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే నాల్గో సీజన్ కు సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు. నేడు తొలి ఎపిసోడ్ ను షూట్ చేశారు.

కాగా, అన్‌స్టాప‌బుల్ తొలి ఎపిసోడ్ కోసం గెస్ట్ గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని రప్పించారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. మొద‌టి ఎపిసోడ్ ఆహాలో అక్టోబ‌ర్ 25న రాత్రి 8.30 గంట‌ల‌కు స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ షో బావ బామ‌ర్దిల మ‌ధ్య స‌ర‌దాగా సాగిన‌ట్లుగా స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement