నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై అంచనాలు ఏ మేర ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ ను షూట్ చేయగా ఇటీవల కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
అయితే ఇప్పుడు షూటింగ్ లకు పర్మిషన్లు వస్తుండడంతో ఈ సినిమా మిగిలిన పార్ట్ ను కంప్లీట్ చేయడానికి సిద్ధమవుతున్నారు యూనిట్ సభ్యులు. జూలై మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని రీస్టార్ట్ చేయాలని చూస్తున్నారట దర్శక నిర్మాతలు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు .