నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పదిరోజుల ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన షూటింగ్ అంతా కంప్లీట్ అయింది.
కాగా స్టంట్ కోఆర్డినేటర్ స్టన్ సిల్వా ఈ సినిమాకు సంబంధించి నిన్న సాయంత్రం ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నందమూరి అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. అఖండ ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ తో పాటు ఇతర యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయటానికి ఏకంగా 80 రోజులు సమయం పట్టిందట. అంటే ఓన్లీ యాక్షన్ సన్నివేశాలు మాత్రమే 80 రోజులు సమయం వెచ్చించారంటే ఏ రేంజ్ లో ఈ సినిమా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయో అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.