కే కే మీనన్ ప్రధాన పాత్రలో సుధాంశు శర్మ దర్శకత్వం వహించిన బ్యాడ్మింటన్ నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా ‘లవ్ ఆల్’. స్వస్తిక ముఖర్జీ, శ్రీస్వర, సుమిత్ అరోరా, ఆర్క్ జైన్, దీప్ రంభియా, అతుల్ శ్రీవాస్తవ, రాబిన్ దాస్ కీలక పాత్రధారులు. దిలీప్సోని జైస్వాల్, రాహుల్ వి.దూబే, సంజయ్ సింగ్ సహ నిర్మాతలుగా ఎం.రమేష్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ద్వారా ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, బంగ్లా , ఒడియాతో సహా ఆరు భారతీయ భాషలలో ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించింది.
కే కే మీనన్ మాట్లాడుతూ ” ఈ సినిమాలో మెయిన్ స్టార్ బ్యాడ్మింటన్. ఎప్పటి నుంచో స్పోర్ట్స్ సినిమా చేయాలని ఉంది. ఈ సినిమాతో ఆ కల నెరవేరింది. ఇది నాకు చాలా స్పెషల్ మూవీ.” అన్నారు.
పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ” బ్యాడ్మింటన్ నేపధ్యంలో ఇలాంటి మంచి సినిమా రావడం చాలా అనందంగా వుంది. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. సినిమా చూశాను. చాలా బావుంది. బ్యాడ్మింటన్ గురించే కాదు మొత్తం స్పోర్ట్స్ గురించి చాలా ముఖ్యమైన చిత్రమవుతుంది. స్పోర్ట్స్ ని కెరీర్ గా తీసుకోవాలా వద్దా అనే మీమాంస పేరెంట్స్ లో ఎప్పుడూ వుంటు-ంది. ఈ సినిమా చూసిన వారు ఇది మన కలే కదా అనుకుంటారు. పిల్లల ద్వారా ఆ కలని సాకారం చేసుకోవాలని భావిస్తారు. చాలా గొప్ప సినిమా ఇది. ” అన్నారు.
సుధాంశు శర్మ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని పుల్లెల గోపీచంద్ ప్రజంట్ చేయడం చాలా అనందంగా వుంది. మునుపెన్నడూ చూడని బ్యాడ్మింటన్ ని ఈ చిత్రంలో చూస్తారని నమ్మకంగా చెబుతున్నాం.” అన్నారు