రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో మావరిక్ డైరెక్టర్ సుకుమార్ ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ చాలా కాలం క్రితమే గ్రాండ్గా జరిగింది. పుష్ప తర్వాత సుకుమార్ ఈ సినిమా చేస్తారని అనుకున్నారు. అయితే పుష్ప సెకండ్ పార్ట్ తీయాలనే ఆలోచన అప్పట్లో సుకుమార్ దగ్గర లేకపోవడంతో విజయ్ దేవరకొండతో ఓ లవ్ స్టోరీ తీయాలని ప్లాన్ చేసాడు.
ఇప్పుడు పుష్ప రెండు పార్ట్ లుగా మారింది. దీంతో సుకుమార్ కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారాడు. ఇప్పుడు సుకుమార్ మీడియం బడ్జెట్ సినిమా లేదా లవ్ స్టోరీ చేసే ఉద్దేశంలో లేనట్టు కనిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం అతని తదుపరి ప్రాజెక్ట్ రామ్ చరణ్ హీరోగా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
దర్శకుడు సుకుమార్, నటుడు విజయ్ దేవరకొండల సినిమా పై ఎలాంటి వార్తలు కూడా రావడం లేదు. అంతే కాకుండా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాలేదు. కాగా, వీరి ప్రాజెక్ట్ కాన్సెల్ అయిందని స్పష్టం అవుతుంది. ఈ వార్త విజయ్ దేవరకొండ అభిమానులను ఖచ్చితంగా నిరాశపరుస్తుంది.
ఇక, విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత మంచి కంబ్యాక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో ‘కుషి’ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆ తరువాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కూడా ఒక మూవీ చేయనున్నాడు విజయ్.