సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసే విధంగా ఈ చిత్ర ట్రైలర్ వచ్చింది. నేచరల్ స్టార్ నాని చేతులమీదుగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.