ప్రతి రోజు సినిమా పరిశ్రమకు ఎన్నో కలలతో వచ్చే వారు ఎంతోమంది ఉంటారు. ఆ కలలను సాకారం చేయడం కోసం రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ప్రై.లి.ప్రొడక్షన్ హౌస్ స్థాపిం చినట్లు- యువ నిర్మాత విజయ్‌రెడ్డి తెలిపారు. రామానాయుడు స్టూడియోస్ ఆవరణలో మూడుసినిమాల ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మొదటి సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సోషల్ వర్కర్స్’ ప్రసాద్ దర్శకుడు. ఈ సినిమాలో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్న మరో సినిమా ‘కోబలి’. ఇందులో మిత్ర ప్రధాన పాత్రధారి. మరియు సహ నిర్మాత. సోషల్ వర్కర్స్, కోబలి సినిమా పూజా కార్యక్రమాలకు ప్రముఖ నటు-డు బాబు మోహన్, పలువురు రాజకీయ నాయకులు అతి థులుగా హాజరు అయ్యారు.
అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బాబు మోహన్ క్లాప్ ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో పాటు- ‘హ్యాపీ విమెన్స్ డే’ సినిమాను ప్రకటించారు.
బాబు మోహన్ మాట్లాడుతూ ” ఈ సినిమాలో ఓ పాత్ర కు నన్ను అనుకుంటు-న్నట్లు- చెప్పారు. అలా ఈ సినిమాలో నేనూ ఓ భాగం అయ్యాను.” అని చెప్పారు. .
కోబలి దర్శకుడు మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే యుద్ధంతో తీస్తున్న చిత్రం కోబలి. అని చెప్పారు. సోషల్ వర్కర్స్ దర్శకుడు ప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో కథ ఉంటు-ంది. అని చెప్పారు. హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.