చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అవికా గోర్. అయితే ఆ తర్వాత ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ వంటి చిత్రాలతో మరింత దగ్గరయింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడికి పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రావట్లేదు. దీంతో పెళ్లికి రెడీ అంటోంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ఎప్పుడు అనే దానిపై క్లారిటీ ఇచ్చింది అవికాగోర్.
తన వయస్సు ఇంకా తక్కువే కాబట్టి పెళ్లి పీటలు ఎక్కడానికి తొందర లేదని కానీ మనసు దోచిన మిలింద్ బాబు ఎప్పుడంటే అప్పుడు ఏడు అడుగులు వేయడానికి రెడీ అని చెప్పుకొచ్చింది. కాగా మిలింద్ ను అవికా ఎప్పటినుంచో ప్రేమిస్తుంది. మిలింద్ చూసిన తొలి క్షణం నుంచే అవికా ఇష్టం పెంచుకుందట. ముందుగా తానే తన ప్రేమ విషయం కూడా చెప్పేసిందట.