Sunday, September 15, 2024

Australia | వ‌న్డే ట్రోఫీతో ఫోజులిచ్చిన రామ్ చరణ్

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 15వ ఎడిషన్ జరుగుతోంది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వేడుక 25 వరకు జరగనుంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ పాల్గొనేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి వెళ్లారు. అక్క‌డ‌ వీరిద్దరూ కలిసి దిగిన‌ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇవన్నీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.

అయితే, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ICC ODI వరల్డ్ కప్ 2023ని ప్రదర్శించింది. ఈ వరల్డ్ కప్ ట్రోఫీతో రామ్‌చరణ్ ఫోటోలకు పోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ఈ మూవీ జ‌రుపుకుంటోంది. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న చ‌ర‌ణ్ తిరిగి వ‌చ్చిన త‌రువాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో RC16 వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీలో న‌టించ‌నున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement