బండ్ల గణేష్… ఈ పేరు చెప్పగానే అర్థమయ్యే ఉంటుంది. అక్కడ విషయం ఏదో ఒకటి ఉండే ఉంటుందని అవును. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరోసారి తన భక్తిని చాటుకున్నారు బండ్ల గణేష్ . తన స్పీచ్ ప్రారంభిస్తూనే… ఈశ్వర పవనేశ్వర…పవరేశ్వర అంటూ ఫ్యాన్స్ లో జోష్ ని తీసుకొచ్చారు.నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం. అలవాటు చేసుకుంటే చచ్చి బూడిద అయ్యే వరకు మనం వదలలేం. ఒక ఐపీఎస్ దగ్గరికి వెళ్లి టెన్త్ క్లాస్ బాగా పాసయ్యారు అని చెప్పటం పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడటం ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూడని బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ ఇట్లు ,చరిత్రలు లేవు. నన్ను చాలామంది అడిగారు నీ బాస్ ఏందిరా ఓసారి సినిమా, మరోసారి రాజకీయాలు అంటాడు అని. నేను అప్పుడు చెప్పా….ఆయనకి మనలా కోళ్ల వ్యాపారం, పాల వ్యాపారం, సారా వ్యాపారాలు లేవు. ఉన్నది బ్లడ్ వ్యాపారం. ఆయన రక్తాన్ని చెమటగా మార్చి జనానికి అందించే వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు.
వెంకన్న కు అన్నమయ్య, శివుడికి భక్తకన్నప్ప ,రాముడికి హనుమంతుడు, పవన్ కళ్యాణ్ కి నేను అంటూ చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ఊరికే ఎవరు గొప్ప వాళ్ళు కాదు. అందరూ పుడుతుంటారు, చచ్చిపోతూ ఉంటారు…కొందరు చరిత్ర లో ఉంటారు. రోజులో 18 గంటలు పనిచేస్తూ సినిమా వెనుక సినిమా చేస్తూ 1200 మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు బండ్ల గణేష్. ఆయన కళ్ళల్లో నిజాయితీ ఉంటుంది. నేను చాలాసార్లు పవన్ కళ్యాణ్ కి అబద్దం చెప్పి మోసం చేద్దామని అనుకున్నను. కానీ కళ్ళల్లోకి చూసిన వెంటనే నావల్ల కాలేదని అన్నారు బండ్ల గణేష్.