Friday, November 22, 2024

అప్ప‌ట్లో నా నెల‌ ఆదాయం రూ.750.. ఉషా ఊత‌ఫ్

తెలుగులో కీచురాళ్లు (1991), బంగారు కోడిపెట్ట (2014), శివలింగ (2017), రేసు గుర్రం (2014) తదితర ఎన్నో చిత్రాలకు ఆమె పాటలు పాడారు గాయ‌ని ఉషా ఊత‌ప్. బాలీవుడ్ లో 1971లో వచ్చిన హరేరామ హరే కృష్ణ ఆమెకు మొదటి సినిమా.తెలుగుతోపాటు హిందీ చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన పాటలకు స్వరాన్ని అందించారు గాయ‌ని ఉషా ఊత‌ప్. ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. ప్రొఫెషనల్ సింగర్ కావడానికి ముందు ఆమె ఓ నైట్ క్లబ్ సింగర్ గా కెరీర్ మొదలు పెట్టిన విషయాన్ని ఆమె స్వయంగా ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. ఓ హోటల్ తో ప్రొఫెషనల్ కాంట్రాక్టు కుదుర్చుకున్నాను.

ఈ విషయంలో మా ఆంటీ సాయపడ్డారు. అప్పుడు నాకు రూ.750 ఆదాయం వచ్చేది. అది ఒక్క రోజు పాడినందుకు కాదు, ఒక నెలంతా పాడినందుకు ఇచ్చే మొత్తం. క్లబ్ లో నించుని పాడడం ఎంతో అద్భుతంగా అనిపించేది. ఆ రోజుల్లో అత్యధిక వేతనం పొందే నైట్ క్లబ్ సింగర్ ను నేనే. దేవ్ ఆనంద్ ఓ రోజు నా పాట వినేందుకు ఢిల్లీలోని నైట్ క్లబ్ కు వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత నా దగ్గరకు వచ్చి హరే రామ హరే కృష్ణ ప్రాజెక్టులో పనిచేస్తారా అని అడిగారు. ఆ సమావేశం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే నా స్వరాన్ని, నేను పాడిన విధానాన్ని ఆయన ఎంతో నచ్చారు. ఆ తర్వాత నేను గొప్ప మ్యూజిక్ కంపోజర్లు అయిన ఆర్డీ బర్మన్, బప్పీల హరి వంటి వారితో పనిచేశా అని ఉషా తన ప్రస్థానాన్ని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement