మండు వేసవిలో మలయమారుతంలా హాయిగా నవ్వకునే సినిమా అ ఒక్కటి అడక్కు.. టాలీవుడ్ లో అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత క్యామెడీ సినిమాలో నటించి మెప్పించాడు. ఈ మూవీలో అల్లరి నరేష్ పెళ్లి కాని ప్రసాద్ రోల్ చేశాడు. ఏజ్ బార్ అవుతున్నా అమ్మాయి దొరక్క ఇబ్బంది పడే యువకుడు పాత్ర చేశాడు. అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదు. ఇది ఓ దశాబ్దకాలంగా వేధిస్తున్న సమస్య. పెళ్లి ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఆత్మహత్యలు చేసుకున్న కుర్రాళ్లకు సంబందించిన వార్తలు మనం తరచూ చూస్తున్నాము. పెళ్లి కాకపోవడం ఒక బాధ అయితే… సొసైటీకి సమాధానం చెప్పుకోలేకపోవడం మరొక సమస్య. ఈ పాయింట్ ఆధారంగా తెరకెక్కిందే ఆ ఒక్కటీ అడక్కు.
దర్శకుడు పెళ్లిని బిజినెస్ గా మార్చేసిన విధానం. దాని చుట్టూ జరుగుతున్న వ్యాపారం, మాట్రిమోని సైట్స్ పాటించే పద్దతులను కామెడీగా చెప్పే ప్రయత్నం చేశాడు.ఈ డ్రామా ఒకింత నవ్వులు పూయిస్తుంది. పెళ్లికాని ప్రసాద్ పాత్రలో అల్లరి నరేష్ చక్కగా సెట్ అయ్యాడు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం అల్లరి నరేష్ కి సహజంగా ఉన్న టాలెంట్. ఫరియా తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష కామెడీ పంచడంలో సపోర్ట్ చేశారు. సెకండ్ హాఫ్ ని కూడా కామెడీతో ఆరంభించిన దర్శకుడు సీరియస్ ఇష్యు తో కూడిన హాట్ సీన్స్, డైలాగ్స్ తో కథను మలుపు తిప్పాడు. ఈ మూవీకి గోపి సుందర్ మ్యాజిక్ ఒక్కటే మైనస్.. మల్లి అంకం దర్శకత్వం వహించగా.. రాజీవ్ చిలక నిర్మించారు. వీకెండ్ లో కుటుంబం అంతా చూడతగ్గ సినిమా