యువ కథానాయకుడు అశోక్ గల్లా తన తదుపరి చిత్రం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్తో చేతులు కలిపారు. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రేమ, హాస్యం మేళవింపుతో ఈ తరం మెచ్చే అందమైన కథతో రాబోతుంది.
చిత్ర ప్రకటనకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ను బట్టి చూస్తే.. ఈ చిత్ర కథ అమెరికాలో జరుగుతుందని అర్థమవుతోంది.ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ తో కూడిన పోస్టర్ డిజైన్ ఆకట్టు-కుంటోంది. ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోంది. పలు విజయవంతమైన చిత్రాల ను అందించే నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న సితార అనతి కాలంలోనే తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. లవర్లో తన నటనతో విమర్శకుల మరియు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మ్యాడ్ మూవీ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.ఉద్భవ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌ జన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.