Monday, July 1, 2024

Ashika Ranganath | కార్తీ స‌ర‌స‌న అషికాకి ఛాన్స్..

నాగార్జున ‘నాసామిరంగ’తో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచేసింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాథ్‌. అయితే.. అవకాశాలు మాత్రం ఈ ముద్దుగుమ్మకు అనుకున్న స్థాయిలో రాలేదనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగులో చిరంజీవి ‘విశ్వంభర’లో కీలక పాత్ర పోషిస్తున్నదని సమాచారం.

ఇదిలావుంటే.. ఇతర భాషల్లో అషికాకు అవకాశాలు బాగానే ఉన్నాయి. కన్నడలో రెండుమూడు సినిమాలు చేస్తున్న ఈ అందాలభామ.. తాజాగా తమిళంలో ఓ భారీ ఆఫర్‌ని దక్కించుకుంది. ఆ సినిమానే ‘సర్దార్‌ 2’.

కార్తీ కథానాయకుడిగా రూపొందిన ‘సర్దార్‌’ తమిళనాట భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్‌ 2’ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు పీఎస్‌ మిత్రన్‌. ఇందులో హీరోయిన్‌గా నటించే ఛాన్స్‌ను కొట్టేసింది అషికా రంగనాథ్‌. అంతేకాక, సిద్దార్థ్‌ హీరోగా నటిస్తున్న ‘మిస్‌ యు’ సినిమాలో కూడా నటిస్తున్నది అషికా. ఇవి విజయాలు సాధిస్తే కోలీవుడ్‌లో ఈ అందాలభామకు మంచిరోజులొచ్చినట్టే.

Advertisement

తాజా వార్తలు

Advertisement