ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో సోమవారం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విలన్ పాత్ర పై సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రామ్ ను ఢీకొట్టే విలన్ గా తమిళ హీరో ఆర్య కనిపించబోతున్నాడట. దీనిపై అధికారికంగా త్వరలోనే ప్రకటన రానుందట.