Friday, November 22, 2024

Engegment- హీరోతో అర్జున్ కుమార్తె నిశ్చితార్థం

ప్రముఖ నటుడు అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య త్వరలో పెళ్లిపీట‌లెక్క‌బోతుంది. కోలీవుడ్ దిగ్గజ నటుడు తంబి రామయ్య కొడుకు, నటుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఉమాపతి రామయ్య, ఐశ్వర్య కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాలిటీ షోలో ఉమాపతి పాల్గొనడంతో ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలోపడ్డారు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి ప్రతిపాదన చేశారు. అంగీకారం లభించడంతో వివాహానికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా తంబి రామయ్య ప్రముఖ హాస్యనటుడిగా, సహాయ నటుడిగాను చాలా తమిళ సినిమాల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement