ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ దంపతులు విడాకులు తీసుకున్నారు. తన భార్య సైరా భానుకు విడాకులు ఇస్తున్నట్లు ఏఆర్ రెహమాన్ ప్రకటన చేశారు.
రెహమాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సైరా బాను తెలిపింది. ‘చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించొద్దు’ అంటూ సైరా బాను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.