బ్లాక్ బస్టర్ ‘డిజె టిల్లు’కు సీక్వెల్ గా రూపొందిన టిల్లూ స్క్వేర్ విడుదలకు రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లుగా తన పాత్రను తిరిగి పోషించగా.. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ అతడితో రొమాన్స్ చేస్తోంది సిద్ధూతో ఆమె చేసిన శృంగార సన్నివేశాలు చాలా మందిని ఆకర్షించాయి.
చివరగా అనుపమ ఈ సీన్స్ గురించి తన మౌనాన్ని వీడింది. అనుపమ పరమేశ్వరన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిల్లూ స్క్వేర్లో సిద్ధు జొన్నలగడ్డతో నటించిన ఘాటైన సన్నివేశాల గురించి హోస్ట్ ప్రశ్నించారు. ఇందులో రొమాన్స్ సీన్స్ గురించి ప్రశ్నించారు. అయితే కెమెరాల ముందు అంతమంది సమక్షంలో రొమాన్స్ సీన్లలో నటించడం అంత సులువు కాదని అనుపమ అంది.
వందమంది ముందు నటించడం చాలా కష్టం. ఆ సమయంలో పాత్రలో లీనమవుతూ, ఆడియెన్స్ ని మెప్పించాల్సి ఉంటుంది. ఇది అంత ఈజీ కాదని అంది. రొమాన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు.