Thursday, July 25, 2024

Anupama | టాలీవుడ్ న‌ల్ల క‌లువ…

ప్రేమమ్‌ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో బిజీ బిజీగా సినిమాలు చేస్తుంది. గత ఏడాది ఈ అమ్మడికి టాలీవుడ్‌లో దక్కిన హిట్స్ నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచిందనే వార్తలు వచ్చాయి. పారితోషికం పెంచిన కూడా ఆఫర్లు తగ్గకపోగా, మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

టిల్లు స్క్వేర్ సినిమా తర్వాత ఈ అమ్మడిని గ్లామర్‌‌గా చూపించాలని దర్శకులు భావిస్తున్నారు. ఇంతకు ముందు మాదిరిగా కాకుండా టిల్లు సినిమాలో చూపించినట్లుగా అందాల విందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నట్లుగా ఈ అమ్మడు సిగ్నల్స్ ఇస్తుందనే వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసిన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా ఈ అమ్మడు ఎక్కువ శాతం మోడ్రన్‌ డ్రెస్ లో కన్నుల విందు చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఈ అమ్మడు బ్లాక్ చీర కట్టులో వావ్‌ అనిపించేంత అందంగా కనిపిస్తుంది.

బ్లాక్ చీర కట్టు లో అందాల నల్ల కలువ ఉన్నట్లు ఉన్నావని, కళ్లకు కాటు పెట్టడంతో పాటు బ్లాక్ బొట్టు వల్ల అందం మరింత పెరిగిందని, అరచేతి మందం మేకప్‌ లు వేసుకుని అందంగా కనిపించాలి అనుకునే హీరోయిన్స్ కు అనుపమ పరమేశ్వరన్ ఆదర్శంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement