మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్లో చాలా తొందరగానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవలే విడుదలైన “టిల్లు స్క్వేర్” సినిమాలో తన గ్లామర్ క్యారెక్టర్‌తో పాటు, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించి ప్రేక్షకులను స్టన్ అయ్యేలా చేసింది. ఈ సినిమాతో అనుపమ తన కెరీర్లో ఒక కొత్త మలుపు తీసుకుందనే చెప్పాలి.
ఇంతవరకు గ్లామర్ పాత్రలు తగ్గిస్తానని చెప్పిన అనుపమ, ఇప్పుడు రొమాంటిక్ సీన్స్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, అనుపమ కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ప్రతి కథను, పాత్రను ఎంతో సమర్థవంతంగా చూసి ఆమోదిస్తుంది. కేవలం గ్లామర్ సీన్స్ కోసం పాత్రలను అంగీకరించే వాళ్ళల్లో అనుపమ చేరడం లేదని ఆమె గత సినిమాలను చూస్తే అర్ధమవుతుంది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులో హీరోయిన్ ఒరియెంటెడ్గా సిద్ధమవుతోన్న “పరదా” మూవీ షూటింగ్ దశలో ఉంది. అలాగే మాతృభాష మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది. తమిళంలో “లాక్ డౌన్” అనే మూవీ కంప్లీట్ చేసింది, మరియు “బిసన్” అనే మరో మూవీ షూటింగ్ స్టేజ్‌లో ఉంది.
ఇవి కాకుండా కొత్త ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన కథలు వింటున్నట్లు తెలిసింది. ఓ స్టార్ హీరోతో కలిసి నటించే అవకాశం వస్తే, ఆమె రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చీరలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనుపమ కొంగు చాటు అందాలతో నడుము వంపులతో స్టన్ అయ్యేలా స్టిల్స్ ఇచ్చింది. స్లిమ్ అయిన తర్వాత ఆమె లుక్స్ మరింత మెస్మరైజ్ చేస్తున్నాయి. ఈ కొత్త లుక్‌తో పాన్ ఇండియా స్థాయిలో తన కెరీర్‌ను మరింత పటిష్టం చేసుకునే దిశగా అనుపమ పరమేశ్వరన్ అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది.