ప్రముఖ స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్ తో డేటింగ్ లో ఉంది బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ మొదటి భార్య కుమారై అన్షులా కపూర్. ఈ విషయాన్ని కన్ఫ్మాం చేస్తూ ఫొటోని పోస్ట్ చేసింది. తన ప్రియుడు రోహన్ థక్కర్ తో స్విమ్మింగ్ పూల్లో దిగిన రొమాంటిక్ ఫొటోను ఇన్ స్టాలో పంచుకుంది బ్యూటీ. ఆ ఫొటోకు హార్ట్ ఎమోజీతో 366 అని క్యాప్షన్ జత చేసింది. అంతేకాదు వీరిద్దరు మాల్దీవుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ కు మాల్దీవుల లొకేషన్ ను కూడా ట్యాగ్ చేసింది అన్షూ. ఈ పోస్ట్ తో బాలీవుడ్ లో పెద్ద చర్చ స్టార్ట్ అయ్యింది. నెటిజన్లు మాత్రం వరుసగా కామెంట్లు మొదలెట్టారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ.. శుభాకాంక్షలు కూడా చెపుతున్నారు సినీ జనాలు. బాలీవుడ్ లో ప్రేమలు బ్రేకప్ లు కామన్.. మేం ప్రేమలో పడ్డాం అని చెప్పుకుంటారు.. విడిపోతున్నాం అని కూడా.. గొప్పగానే ప్రకటించుకుంటారు.మరి అన్షులా పెళ్లి వరకు వెళ్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement