బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నటి హేమకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆమె మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కోల్పోయింది. హేమ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, దీనికి సంబంధించి మా కార్యదర్శి రఘుబాబు కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తెలిపారు. హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.