Tuesday, November 19, 2024

త్రిష పెళ్లిపై తెరపైకి మరోవార్త !!

హీరోయిన్ త్రిష పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో ఒక్కటి కూడా జరగలేదు. ఇప్పుడు తాజాగా త్రిష పెళ్లి పై మరో వార్త తెరపైకి వచ్చింది. తమిళ మీడియా కథనాల ప్రకారం ఈ అమ్మడు పెళ్లి గురించి గత కొంత కాలంగా సీరియస్ ఆలోచన చేస్తుందట.అంతే కాదు బిజినెస్ మ్యాన్ తో పెళ్లికి కూడా సిద్ధమైందని సమాచారం. కాగా ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియడం లేదు. అది నిజమో కాదో తెలియాలంటే ఎవరో ఒకరు అధికారికంగా స్పందించాల్సిందే.

ఒకానొక సమయంలో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషలలో కొనసాగిన త్రిషకు ప్రస్తుతం అవకాశాలు పెద్దగా లేవు. అందుకే త్రిష పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తోంది. గతంలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత చాలాకాలం పెళ్లి ప్రస్తావన ఎత్తలేదు త్రిష. ఇక ప్రస్తుతం త్రిష చేతిలో ఓ రెండు సినిమాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement