Tuesday, November 19, 2024

Movie Review : ప్ర‌స‌న్న‌వ‌ద‌నంతో సుహాస్ కు మ‌రో హిట్

- Advertisement -

క‌థ విష‌యానికి వ‌స్తే సూర్య (సుహాస్‌) రేడియో జాకీగా పనిచేస్తుంటాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. అమ్మానాన్నల్ని కోల్పోవడంతోపాటు… ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే సమస్య బారిన పడతాడు. ఫేస్ బ్లైండ్‌నెస్‌తో ఎవరి మొహాల్నీ గుర్తు పట్టలేడు, వాయిస్‌నీ గుర్తించలేడు. తన స్నేహితుడు విఘ్నేష్ (వైవా హర్ష)కి తప్ప తన సమస్య ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఆద్య (పాయల్‌)తో ప్రేమలో కూడా పడతాడు. ఇంతలోనే తన కళ్ల ముందు ఓ హత్య జరుగుతుంది. తనకున్న సమస్యతో ఆ హత్య ఎవరు చేశారో తెలుసుకోలేడు. కానీ, పోలీసులకి ఈ విషయం తెలియాలని ప్రయత్నిస్తాడు. ఆ వెంటనే అతనిపై దాడి జరుగుతుంది. అయినా వెనకడుగు వేయని సూర్య.. ఏసీపీ వైదేహి (రాశిసింగ్‌) దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెబుతాడు. తనకున్న సమస్యనీ వివరిస్తాడు. అనూహ్యంగా ఆ హత్య కేసులో సూర్యనే ఇరుక్కోవల్సి వస్తుంది. ఇంతకీ ఆ హత్య ఎవరు చేశారు?హత్యకి గురైన అమ్మాయి ఎవరు?ఆ కేసులో సూర్యని ఇరికించింది ఎవరు?అసలు నిందితులు ఎప్పుడు ఎలా బయటికొచ్చారు?సుహాస్ ప్రేమకథ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఏదో ఒక డిజార్డర్‌తో కథానాయకుడి పాత్రకి పరిమితులు విధించి… జీవన్మరణ సమస్య తరహాలో అతని చుట్టూ పలు సవాళ్లని సృష్టించి కథని నడిపించడం చాలా సినిమాల్లో చూసిందే , సుహాస్‌ని ఇందులో చూడటం కొత్తగా అనిపిస్తుంది. మంచి మలుపులతో ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచడంలోనూ దర్శకుడు విజయం సాధించాడు. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఆరంభ సన్నివేశాల్ని మలిచాడు దర్శకుడు. కథానాయకుడికీ, అతని స్నేహితుడికీ మధ్య సన్నివేశాలు, ఆద్యతో ప్రేమాయణం ఎపిసోడ్‌తో ఆరంభ సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. కథానాయకుడు హత్య జరగడాన్ని చూడటం నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. విరామానికి ముందు అనూహ్యంగా కథలో చోటు చేసుకునే మలుపు సినిమాని ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement