స్వప్న సినిమా సంస్థ నందిని రెడ్డి దర్శకత్వం లో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రధారులుగా నిర్మిస్తున్న చిత్రం ‘అన్నీ మం చి శకునములే’. రాజేంద్రప్రసాద్, రావు రమే ష్, నరేష్, గౌతమి, సౌకార్ జానకి, వాసుకి ఇత ర ముఖ్య తారాగణం.
ఇప్పటి వరకు విడుదల చేసిన మూడు పాటలు హిట్ అయ్యాయి. నాలు గవ సింగిల్ ”చెయ్యి చెయ్యి కలిపేద్దాం” విడు దల చేసారు. మిక్కీ జే మేయర్ బాణీ అందిం చారు.
దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ పాట విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.
కే..రాఘవేంద్రరావు మాట్లాడుతూ ”నా సినిమాలకి హీరోయిన్ ముఖ్యం. అందుకే ముందు హీరోయిన్ గురించే మాట్లాడతా. ఈ సినిమాలో హీరోయిన్ చాలా అందంగా వుం ది. సంతోష్ శోభన్ కి అల్ ది బెస్ట్. నందిని, స్వప్న, ప్రియాంక .. ముగ్గురూ తెలివైన వాళ్ళు. అన్నీ మంచి శకునములే. ఈ పాట చూసినప్పుడు పెళ్లి సందడి చూసినంత ఆనందం కలిగింది. పెళ్లి సందడి అంత పెద్ద విజయం ఈ సినిమా సాధిస్తుంది” అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ” చిన్న సినిమాక్ కూ డా ఎక్కువ ఖర్చు చేయడం దత్‌కి అలవాటు-. ఈ చిత్రానికి కూ డ ఎక్కువ ఖర్చుపెట్టారని తెలుసు. ఇది కూడా లాభాలు తెచ్చి పెడుతుంది.” అన్నారు. సి. అశ్వినీదత్ మాట్లా డుతూ ” పెళ్లి సందడి కోటి ఇరవై లక్షలతో తీస్తే 14 కోట్లు- పే చేసింది. అరవింద్ గారు, నేను కలసి ఓ హిందీ సినిమా చేశాం. వచ్చిందానికంటే ఎక్కువ పోయింది. అయితే లాభం వచ్చిన ప్పుడు పొంగిపోలేదు, నష్టం కలిగినప్పుడు క్రుంగిపోలేదు. ఎప్పుడూ ఒకేలా వున్నాం. అన్నారు.
నందినీ రెడ్డి మాట్లాడుతూ ” నేను పరిశ్రమలోకి వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు , అల్లు అరవింద్ గారు , అశ్వ నీదత్ గారు.. ఈ ముగ్గురికి కలసి కథ చెప్పడం నా అదృష్టం. ఈ ముగ్గురు ఒకేచోట నిలబడి సినిమా గురించి మాట్లాడం ఆనందంగా వుంది” అన్నారు. ప్రియాంక దత్ మాట్లాడుతూ ” చిన్నప్పటి నుంచి ముగ్గురిని చూస్తూ పెరిగాం. ఇలా ముగ్గు రిని ఒకే వేదికపై చూడటం ఆనందంగా వుంది” అన్నారు.
స్వప్న దత్ మాట్లాడుతూ ”నాన్నతో ఏదైనా సమస్య వుంటే రాఘవేంద్రరావు అంకుల్ దగ్గరికి వెళ్లి ఎలా చెప్పించా లో చూస్తాను. అది అవ్వకపొతే అరవింద్ అంకుల్‌కి ఫోన్ చేసి డాడీని తిట్టు-కుంటాను. మేము వాళ్ళ పిల్లల్లా పెరిగాం.” అన్నా రు. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దావూద్ స్క్రీన్‌ప్లే అందించగా, లక్ష్మీ భూపాల సంభాషణలు రాశారు.