Saturday, November 23, 2024

కూతురు ఆత్మహత్య పై పెదవి విప్పిన అన్నపూర్ణ

టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కొన్ని వందల సినిమాల్లో నటించిన అన్నపూర్ణ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తన కూతురు ఆత్మహత్య పై ఆసక్తికర విషయాలు చెప్పారు. నా కూతురు కీర్తిని డాక్టర్ లేదా ఇంజనీర్ చేయాలని కలలు కన్నాను. కానీ తనకు చదువు మీద ఆసక్తి లేదు. దీంతో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి పెళ్లి చేసేసాను. ఒక ఏడాదికి ఆమెకు పాప కూడా జన్మించింది.

కానీ ఏమైందో తెలియదు ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో ఇప్పటికీ నాకు తెలియట్లేదు. ఏనాడు కూడా అత్త ఇంటివారు నన్ను ఇలా అంటున్నారు అని కూడా చెప్పలేదు. ఒకటి మాత్రం నిజం క్షణికావేశంలో మా అమ్మాయి ఆ నిర్ణయం తీసుకుంది అంటూ చెప్పుకొచ్చింది అన్నపూర్ణ.

Advertisement

తాజా వార్తలు

Advertisement