ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటుంటారు. కానీ రచ్చ గెలిచి ఇంట గెలిచిన కథానాయిక ఎవరంటే, అందాల భామ అంజలి అని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజోలు ప్రాంతానికి చెందిన ఈ పదహారణాల తెలుగందం.. టాలీవుడ్ లోనే తన కెరీర్ ప్రారంభించినప్పటికీ, క్రేజీ హీరోయిన్ గా మారింది మాత్రం తమిళ చిత్ర పరిశ్రమలోనే. అక్కడ ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తిరిగి తెలుగులోకి వచ్చి ఇక్కడా స్టార్ స్టేటస్ అందుకుంది.
18 ఏళ్ల లాంగ్ సినీ కెరీర్ కొనసాగించి, 50 సినిమాల సిల్వర్ జూబ్లీ మైల్ స్టోన్ కి చేరువైంది. అంజలి ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘గేమ్ ఛేంజర్’ వంటి మూడు క్రేజీ చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. యాదృచ్ఛికంగా ఈ మూడు సినిమాల పేర్లు కూడా ‘G’ అనే ఇంగ్లీష్ లెటర్ తోనే ప్రారంభం అవుతుండం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే విడుదల అవుతుండటం గమనార్హం. వాటిల్లో రెండు ఈ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంటే.. మరో మూవీ ఇయర్ ఎండింగ్ లోపు థియేటర్లలోకి రానుంది.