తెలుగు హీరోయిన్ అంజలి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలకు కొదవ లేదని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకూ ఏ ఒక్క సినిమాకి కూడా సైన్ చేయలేదట అంజలి.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రెండు ప్రాజెక్టులకు కోసం చర్చలు జరుగుతుందట. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా ఈ అమ్మడు పెళ్లి విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాది చివరి నాటికి వివాహం చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. కాగా ఈ వార్తల అంజలి స్పందించింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని ప్రస్తుతం తన దృష్టి సినిమాలపై మాత్రమే ఉందని రానున్న రోజుల్లో మంచి పాత్రలు పోషించాలని అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.