Saturday, October 5, 2024

Anjali | బ‌హిష్క‌ర‌ణ‌లోనూ అంజ‌లికి అదే పాత్ర…

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి’లో ర‌త్న‌మాల అనే వేశ్య పాత్ర‌లో అంజ‌లి ఏ రేంజ్ లో అల‌రించిందో తెలిసిందే. పాత్ర చిన్న‌దైనా తెర‌పై క‌నిపించ‌నంత సేపు ర‌త్న‌మాల ఓవైబ్ క్రియేట్ చేసింది. అంత వ‌ర‌కూ వేశ్య పాత్ర‌లో అంజ‌లి ఏనాడు న‌టించ‌లేదు. తొలిసారి ఆ పాత్ర‌లో న‌టించి తెలుగు ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌రైంది. ఈ సినిమాతో అంజ‌లి గ్రాఫ్ పెరిగింది.

తాజాగా అమ్మ‌డు మ‌రోసారి వేశ్య పాత్ర‌లో అల‌రించ‌డానికి రెడీ అవుతోంది. అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌లో విలేజ్ బ్యాక్ డ్రాప్ ‘బహిష్క‌ర‌ణ’ అనే వెబ్ సిరీస్ తెర‌కెక్కుతోంది. దీనికి ముకేష్ ప్ర‌జాప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ఈనెల 19న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా అంజ‌లి ఆ పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

‘ఇందులో పుష్ప అనే పాత్ర‌లో న‌టిస్తున్నాను. ఈ పాత్ర‌లో న‌టించ‌డం నాకెంతో సంతృప్తినిచ్చింది. అమాక‌య‌పు వేశ్య నుంచి స‌మాజాంలో అస‌మాన‌త‌లు ఎదుర్కునే స్త్రీ ప్ర‌యాణం అద్బుతంగా ఉంటుంది. పుష్ప అంటే మిస్ట‌రీ అని ఇందులో ఆమె చేసిన ప్ర‌యాణం, వచ్చిన మార్పు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది’ అని అంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ సిరీస్ ప్ర‌చార చిత్రాలు సిరీస్ కి మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. అలాగే అంజ‌లి ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్ లు చేసింది. వాటి ద్వారా మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.

అటు సినిమాలు..ఇటు వెబ్ సిరీస్ ల‌తో అమ్మ‌డి కెరీర్ బిజీగానే ఉంది. ప్ర‌స్తుతం మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న ‘గేమ్ ఛేంజ‌ర్’ చిత్రంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది. ఈ సినిమా హిట్ అయితే అమ్మ‌డి పేరు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. అటుపై అంజ‌లి స్టార్ డ‌మ్ రెట్టింపు అవ్వ‌డం ఖాయం. బాలీవుడ్ అవ‌కాశాల కోసం కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు వినిపిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement